పొరుగు సేవల సిబ్బంది నిలిపివేత తగదు
logo
Published : 12/06/2021 03:51 IST

పొరుగు సేవల సిబ్బంది నిలిపివేత తగదు

నెల్లూరు (సంక్షేమం), న్యూస్‌టుడే : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పనిచేసే 146 మంది నాలుగో తరగతి పొరుగు సేవల సిబ్బందిని నిలిపివేయడం తగదని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎ.సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు శుక్రవారం లేఖ రాశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో కుక్‌, కామాటి, కాపలాదారులుగా వారంతా పనిచేస్తున్నారన్నారు. వసతి గృహాలు లేకపోవడంతో జూన్‌ ఒకటో తేదీ నుంచి నిలిపేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయితే తమ శాఖ డైరెక్టర్‌ కొవిడ్‌ దృష్ట్యా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసినా నిలుపుదల చేశారని ఆరోపించారు.

వేసవి సెలవులనే.. : జీవపుత్రకుమార్‌, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ

ప్రతి సంవత్సరం వసతి గృహాలను వేసవి సెలవుల్లో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సేవలను నిలుపుదల చేస్తున్నాం. పునఃప్రారంభం నాటికి విధుల్లోకి తీసుకుంటాం. అలాగే ఈ ఏడాది కూడా నిలుపుదల చేశాం. వసతి గృహాలు మూసివేస్తే వీరి సేవలు ఏ విధంగా వినియోగించుకుంటాం. ప్రారంభిస్తే మళ్లీ తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని