పునరావాసంపై అభిప్రాయ సేకరణ
logo
Published : 12/06/2021 03:51 IST

పునరావాసంపై అభిప్రాయ సేకరణ


మాట్లాడుతున్న ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌

 

నేలటూరు(ముత్తుకూరు), న్యూస్‌టుడే : మండలంలోని నేలటూరు పంచాయతీని సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలన్న ప్రతిపాదనపై శుక్రవారం అధికారులు అభిప్రాయ సేకరణ చేశారు. నేలటూరు, పాలెం, హరిజనవాడలో ఏర్పాటుచేసిన గ్రామసభల్లో స్థానికుల అభ్యంతరాలను ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ మండలంలోని ధనలక్ష్మీపురం, మాదరాజుగూడూరు ప్రాంతాల్లో పునరావాస కాలనీలను నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. నేలటూరుపాలెం వాసులు ఎక్కడ తమ కాలనీ నిర్మాణం కావాలనే అభిప్రాయం తెలియజేయాలన్నారు. త్వరితగతిన అవసరమైన భూసేకరణ చేసి ఇళ్ల నిర్మాణాలు చేస్తామన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందించినున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సోమ్లానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని