కరోనా వేళ సమర్థవంతంగా సేవలు : జేసీ
logo
Published : 12/06/2021 03:51 IST

కరోనా వేళ సమర్థవంతంగా సేవలు : జేసీ

గూడూరుపట్టణం, న్యూస్‌టుడే: కరోనా సమయంలో సబ్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ సమర్థమంతంగా పని చేసి, కొవిడ్‌ కేంద్రంలో వసతులు కల్పించేలా కృషి చేశారని జేసీ హరేంధిరప్రసాద్‌ కొనియాడారు. గూడూరు సబ్‌ కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ బదిలీపై వెళుతున్న క్రమంలో శుక్రవారం స్థానిక డీఎన్‌ఆర్‌ కమ్యూనిటీహాల్‌లో వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ డివిజన్‌ సమస్యల పరిష్కారంలో ఆయన అంకితభావంతో పని చేశారని కొనియాడారు. తన 20 నెలల పాలనాకాలంలో అనేక సమస్యలు పరిష్కరించారన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతర సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ దంపతులను సన్మానించారు. కావలి, ఆత్మకూరు, నాయుడుపేట డివిజన్ల ఆర్డీవోలు, పురపాలక ప్రత్యేకాధికారి మణికుమార్‌, పురపాలక సంఘాల కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని