రూ.6 లక్షల విలువైన గంజాయి పట్టివేత
logo
Published : 12/06/2021 03:51 IST

రూ.6 లక్షల విలువైన గంజాయి పట్టివేత

మార్టూరు, న్యూస్‌టుడే: పదహారో నంబరు జాతీయ రహదారిపై విశాఖ మన్యం నుంచి నెల్లూరు జిల్లాకు తరలిస్తున్న గంజాయిని ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సంబంధిత వివరాలను ఇంకొల్లు సీఐ ఎండీకే.ఆల్తాఫ్‌ హుస్సేన్‌ వెల్లడించారు. రాజుపాలెం జంక్షన్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు కార్లను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. వాటిలో సుమారు 180 కిలోల బరువున్న రూ.6 లక్షల విలువజేసే గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీనిని నెల్లూరు జిల్లా, అక్కడి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఆరుగురు నిందితులుండగా ప్రధాన నిందితుడు లోవ రాజు వ్యక్తి తప్పించుకున్నాడని, మిగిలిన అయిదుగురిని పట్టుకున్నట్టు సీఐ తెలిపారురు. పట్టుబడినవారిలో నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాలేనికి చెందిన ఆవుల మనోహర్‌, తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా చినరాజవరానికి చెందిన చిన్నదేవర ఆశై ఉన్నట్టు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని