ఉపాధి లక్ష్యాల పూర్తికి చర్యలు
logo
Published : 12/06/2021 03:51 IST

ఉపాధి లక్ష్యాల పూర్తికి చర్యలు

పథకం రాష్ట్ర డైరెక్టర్‌ చిన్నతాతయ్య


సిబ్బందికి సూచనలు చేస్తున్న చిన్నతాతయ్య, అధికారులు

 

వెంకటగిరి, న్యూస్‌టుడే : గ్రామాల్లో అభివృద్ధి పనులు కోసం నిర్దేశించిన ఉపాధి హామీ పథకం లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్‌ చిన్నతాతయ్య సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా ప్రభావంతో అనేక మంది సాఫ్ట్‌వేర్లు, ఇతర ప్రాంతాల్లోని కూలీలు స్వగ్రామాలకు వచ్చారన్నారు. వీరికి జాబ్‌ కార్డులు ఇచ్చి పనులు కల్పించాలన్నారు. గ్రామాల్లో పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని సూచించారు. రానున్న వర్షాకాలంలోపు లక్ష్యం పూర్తి చేయాలన్నారు. 2.20 లక్షలు పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.58 లక్షల పనిదినాలు పూర్తి చేశారన్నారు. ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో పనులు చేసేందుకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వివరించారు. వారితో సమన్వయం చేసుకుని పనులు చేయాలని డైరెక్టర్‌ సూచించారు. ఈ క్రమంలో వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకు చెందిన ఉపాధి అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌, డ్వామా పీడీ తిరుపతయ్య, ఏపీడీ గోపి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని