అనధికార లేఅవుట్లపై విజిలెన్స్‌
logo
Published : 12/06/2021 03:51 IST

అనధికార లేఅవుట్లపై విజిలెన్స్‌

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్లను నియంత్రించేందుకు డివిజన్‌ స్థాయి విజిలెన్స్‌ స్క్వాడ్‌లను నియమించినట్లు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు శుక్రవారం రాత్రి తెలిపారు. కొత్తగా అనధికార లేఅవుట్లను అభివృద్ధి చేయకుండా ఈ కమిటీ చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. గూడూరు డివిజన్‌కు విస్తరణాధికారి సీహెచ్‌ రవీంద్ర, పంచాయతీ కార్యదర్శి ఎం.ఉమామహేశ్వరరావు, జూనియర్‌ సహాయకులు ఎ.రాజశేఖర్‌, కావలి డివిజన్‌కు విస్తరణాధికారి ఎ.అప్పాజీ, పంచాయతీ కార్యదర్శి పి.కృష్ణమూర్తి, జూనియర్‌ సహాయకులు డి.కార్తీక్‌, నెల్లూరు డివిజన్‌కు విస్తరణాధికారి డి.నారాయణ, పంచాయతీ కార్యదర్శి పి.మల్లికార్జునరావు, జూనియర్‌ సహాయకులు ఆర్‌.రేవంత్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని