కూలికొచ్ఛి. కన్నుమూసి
logo
Published : 12/06/2021 03:51 IST

కూలికొచ్ఛి. కన్నుమూసి

రహదారి ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం


ప్రమాద స్థలంలో పరిస్థితి

మర్రిపాడు, న్యూస్‌టుడే : కూలి పనులకు వచ్చారు. సాయంత్రం వరకు పనిచేసి హమ్మయ్య అని ఇంటికి తిరుగుప్రయాణం అయ్యారు. అంతలోనే వారిపైకి కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన మర్రిపాడు మండలం బూదవాడ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా, గోపవరం మండలం, బెడుసుపల్లి గ్రామానికి చెందిన కొందరు కూలీలు నందిపాడు వద్ద జామాయిల్‌ కర్ర లోడింగ్‌ పనులకు ఆటోలో వచ్చారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళుతుండగా బూదవాడ సెంటర్‌లో బద్వేల్‌ నుంచి కావలి వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు వేగానికి ఆటో 10 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో వెంకట రమణమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకట శేషయ్య(43) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. ఘటనలో మరో అయిదుగురికి గాయాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరనారాయణ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని