విదేశాలకు వెళ్లే వారికి టీకా
logo
Published : 12/06/2021 03:51 IST

విదేశాలకు వెళ్లే వారికి టీకా

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లా నుంచి విదేశాలకు వెళ్లే వారి సౌకర్యార్థం టీకా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు డివిజన్‌లో పడారుపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం, గూడూరు డివిజన్‌లో మాళవ్యనగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం, నాయుడుపేట డివిజన్‌లో గోట్టిప్రోలు పీహెచ్‌సీ, కావలి డివిజన్‌లో రాజీవ్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, ఆత్మకూరు డివిజన్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా వేయనున్నట్లు తెలిపారు. వేయించుకోవాలనుకునేవారు గుర్తింపు కార్డుగా పాస్‌పోస్టును తమ వెంట తీసుకురావాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని