Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగాల పేరిట రూ.16 లక్షలకు టోకరా

భద్రాచలం, న్యూస్‌టుడే: ఉద్యోగాల పేరిట రూ.16లక్షలకు టోకరా వేసిన ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నెల్లూరుకు చెందిన వనజ-సురేందర్‌ దంపతులు కొంతకాలం క్రితం భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వచ్చి నివాసముంటున్నారు. ఈక్రమంలో చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకున్నారు. పెద్ద నగరాలలో వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని వాటిల్లో పనిచేసేందుకు ఉద్యోగుల అవసరముందని.. వాటిని మీకిస్తామని మాయమాటలు చెప్పారు. ఈ సంస్థల్లో చేరేందుకు ముందుగా కొంత నగదు చెల్లించాలని చెప్పడంతో పలువురు వారి మాటలు నమ్మారు. ఇలా ఐదుగురి నుంచి రూ.16 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాల ఊసేత్తకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు వారిని గట్టిగా నిలదీశారు. మోసం చేశారని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని