Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.136.22 కోట్ల రైతు భరోసా

రైతు భరోసా చెక్కును అందిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే, జేసీ

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలోని 2,47,438 మంది రైతులకు రైతు భరోసా ద్వారా రూ. 136.22 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా తొలివిడత సాయాన్ని విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, రైతులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. తొలుత బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని తిక్కన భవన్‌ నుంచి కలెక్టర్‌ చక్రధర్‌బాబు కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు లక్షల ఎకరాల మాగాణికి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గానికి చెందిన రైతు ఎ.బాబు మాట్లాడుతూ రైతు భరోసా ద్వారా వచ్చిన డబ్బుతో ప్రతి రైతు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జేసీ హరేంధిరప్రసాద్, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

నేడు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల
నెల్లూరు(వ్యవసాయం): కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకునే క్రమంలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ. రెండు వేల చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలోని అర్హులైన రైతుల ఖాతాల్లో గురువారం ఆ సొమ్ము జమవుతుందని జేసీ ఆనందకుమారి తెలిపారు. జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన విషయం విదితమే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని