Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్యంతో పాటుపౌష్టికాహారం

కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని కొవిడ్‌ సెంటర్లలో ఉన్న బాధితులకు వైద్య సేవలతో పాటు పౌష్టికాహారం అందిస్తామని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోని బాధితులతో మాట్లాడారు. వైద్య సేవలు, భోజనం, తాగునీటి సదుపాయాలు, సమయానికి మందులు ఇస్తున్నారా, పారిశుద్ధ్యం తదితరాలను అడిగి తెలుసుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని, పూర్తిగా నయమైన తర్వాతే ఇళ్లకు వెళ్లాలని సూచించారు. జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో వెయ్యి మంది పాజిటివ్‌ వ్యక్తులు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్, డీఎఫ్‌వో షణ్ముఖకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని