Updated : 14/05/2021 06:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై అవగాహన పెంచాలి : డీపీవో


సమావేశంలో మాట్లాడుతున్న డీపీవో ధనలక్ష్మి

బుచ్చిరెడ్డిపాళెం: కరోనా నియంత్రణపై గ్రామాల్లో పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీపీవో ధనలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కంటె కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఆ దిశగా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గ్రామాల్లో పటిష్టంగా కర్ఫ్యూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి అందుతున్న సేవలు, మెడికల్‌ కిట్లు, కొవిడ్‌ సోకిన మృతదేహాల ఖననంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహారావు, నగర కమిషనర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని