Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హత్య కేసులో నిందితుని అరెస్ట్‌


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌

కావలి, న్యూస్‌టుడే : తన భార్యను కాపురానికి రాకుండా అడ్డుకుంటుందనే అక్కసుతో ఆమె అక్కను హతమార్చిన నిందితున్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం కావలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగంగా కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. ఒంగోలు శ్రీనివాసకాలనీకి చెందిన పాముల వెంకయ్యకు రెండు సంవత్సరాల క్రితం జలదంకి మండలం వరదారెడ్డికాలనీకి చెందిన కొండమ్మతో వివాహం జరిగిందన్నారు. ఇటీవల కొండమ్మ..బోగోలు మండలం ముంగమూరులో ఉంటున్న తన అక్క వద్దకు వచ్చారు. తిరిగి భార్య రాకపోవడంతో నిందితుడు వెంకయ్య ఆగ్రహానికి గురై ఈ నెల 11న మద్యం తాగి చెంచమ్మతో వాదనకు దిగాడన్నారు. ఆ క్రమంలో సిమెంట్‌ ఇటుకతో ఆమెను మోది హతమార్చాడన్నారు. నిందితుడిని పట్టుకున్న కావలి గ్రామీణ సీఐ అక్కేశ్వరరావును డీఎస్పీ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని