Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరి సహకారంతో విపత్తును ఎదుర్కోవాలి

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : కరోనా విపత్తు నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు కార్యాచరణ రూపొందించి చర్యలు చేపట్టాలని గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరుకు ఈ మెయిల్‌లో లేఖ పంపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతూ ప్రజల ప్రాణాలను హరింపజేస్తుందన్నారు. జిల్లాలో 16 వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, హోమ్‌ ఐసోలేషన్‌లో ఎంతోమంది అరకొర వసతులతో చికిత్స పొందుచున్నారని వీరిని కాపాడాలని కోరారు. తక్షణమే అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి సహకారంతో విపత్తును నివారించాలని కోరారు. దాతల ఆర్థిక తోడ్పాటు, వారి సలహాలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని విన్నవించారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, సిబ్బందిని పెంచాలని డిమాండ్‌ చేశారు. మందుల బ్లాక్‌మార్కెట్‌ను నివారించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించడం లేదని మంత్రులు అనిల్‌కుమార్‌, గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారని దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని