Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇన్‌ఛార్జిజీఎం మృతి

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇన్‌ఛార్జి జీఎం ఏ.గోపాలకృష్ణ అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయన గతంలో జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం తిరుపతి జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తూ ఇటీవల నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి జీఎంగా బాధ్యతలు చేపట్టారు. కొవిడ్‌ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో బుధవారం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ఉద్యోగులు సంతాపం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని