Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్షేమ పాలనకు అండగానిలవాలి: లక్ష్మణరెడ్డి


మాట్లాడుతున్న వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: తిరుపతి ఉపఎన్నికలో సంక్షేమ పాలన అందిస్తున్న వైకాపాకు అండగా నిలవాలని జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపఎన్నికలో సామాన్యుడైన డాక్టర్‌ గురుమూర్తిని అభ్యర్థిగా నిలబెట్టడం హర్షణీయమన్నారు. రాష్ట్ర విభజనకు ప్రత్యక్షంగా భాజపా, పరోక్షంగా సహకరించిన తెలుగుదేశం పార్టీని ఓడించాలన్నారు. సమావేశంలో బ్రైట్‌ వే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇ.కవితారెడ్డి, నెల్లూరు జిల్లా మత్స్యకారుల సంక్షేమ సంఘం నాయకులు ఐ.సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని