Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాణం తీసిన ఈత సరదా

విష్ణు మృతదేహం

కావలి గ్రామీణం, న్యూస్‌టుడే: బర్రెలను మేతకు తోలుకెళ్లిన ఓ బాలుడు.. నీట మునిగి అనంత లోకాలకు చేరిన సంఘటన మండలంలో గురువారం వెలుగుచూసింది. గ్రామీణ ఎస్సై మాల్యాద్రి కథనం మేరకు.. చెన్నాయపాలేనికి చెందిన సుబ్బారావు కుమారుడు పాటురి విష్ణు(15) బుధవారం బర్రెలను సమీప పొలాల్లో మేతకు తోలుకెళ్లారు. మధ్యాహ్నం వాటిని నీరు తాగించేందుకు చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఎండ వేడిమికి తానూ కాసేపు ఈత కొట్టాలని భావించారు. చెరువులో గుంతలు ఎక్కువగా ఉండటంతో.. ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. సాయంత్రం బర్రెలు ఇంటికొచ్చినా.. కుమారుడు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం చెరువు వద్ద పరిశీలించగా శవమై కనిపించాడు. స్థానికులు గ్రామీణ పోలీసులకు సమాచారమివ్వగా- వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని