Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

వెంకటగిరి, న్యూస్‌టుడే : వైకాపా రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృధ్ధి శూన్యమేనని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి పేర్కొన్నారు. పట్టణంలోని పద్మశాలీయుల కల్యాణ మండపంలో గురువారం చేనేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ వైకాపా రెండేళ్ల పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలతో సాగిందన్నారు. ఒక్క పరిశ్రమ తీసుకురాకపోవడమే కాకుండా ఉన్న పరిశ్రమలు కూడా తరలివెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ఓ చేత్తో పథకాలకు సంబంధించి నగదు ఇస్తూ మరో చేత్తో అధిక మొత్తం పన్నులు, అపరాధ రుసుం పేరుతో ప్రజల సొత్తును దోపిడీ చేస్తున్న ఘనుడు సీఎం జగన్‌ అన్నారు. నాయకులు గంగాధర్‌, రాజేశ్వరరావు, శ్రీనివాసులు, ఆనంద్‌ చేనేత సంఘం ప్రతినిధులు మధుసూదన్‌, లక్ష్మీపతి, చెంచయ్య, మురళి, శ్రీరామ్‌బాబు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని