Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు


మాట్లాడుతున్న ప్రభాకరరెడ్డి

 

నెల్లూరు (కలెక్టరేట్‌) : కొవిడ్‌ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలతో పాటు అత్యవసర పడకలు, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో వైద్యాధికారులు, నోడల్‌ ఆఫీసర్లు, కొవిడ్‌ ఆసుపత్రుల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ లక్షణాలతో వచ్చిన రోగుల ఆరోగ్య స్థితికి అనుగుణంగా సేవలు అందించాలన్నారు. జాప్యం, నిర్లక్ష్యం జరగకుండా చూడాలని నిర్దేశించారు. 24 గంటలు సేవలు అందించాలని ఆదేశించారు. ఆరోగ్యమిత్ర, నోడల్‌ అధికారుల ప్రమేయంతోనే రోగులను చేర్చుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ కార్డులు లేని వారికి సీఎంసీవో లెటర్‌ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలన్నారు. ఈ సేవలు వినియోగించుకునేందుకు చొరవ చూపని వారికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో చికిత్స అందించాలన్నారు. సేవల్లో అసౌకర్యం, లోపాలున్నా ఆరోగ్యమిత్ర, నోడల్‌ అధికారులు, హెల్ప్‌డెస్క్‌ మేనేజర్ల దృష్టికి తీసుకురావాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని