Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పక్కాగా ఎన్నికల ప్రక్రియ


ఉప ఎన్నికల ఏర్పాట్లు పరిశీలిస్తున్న జేసీ హరేంధిర ప్రసాద్‌

 

గూడూరుగ్రామీణం, న్యూస్‌టుడే : ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ అన్నారు. గురువారం గూడూరు పట్టణం జడ్పీ బాలుర పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ఆసరా జేసీ బాపిరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణతో కలిసి ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై అన్ని మండలాల తహసీల్దార్లు, నోడల్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులతో సమీక్షించారు. గూడూరు నియోజకవర్గంలో మొత్తం 2,48,222 మంది ఉండగా 366 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులను 3,588 మందిని గుర్తించి, ప్రత్యేకంగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఏర్పాట్లను ముమ్మరంగా చేసినట్లు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి పోలింగ్‌ రోజు ఎలాంటి సమస్యల లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి, త్వరితగతిన పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లేలా చూస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ సమయాల్లో ఈవీఎంల మొరాయిస్తే హుటాహుటిన వేరే యంత్రాలు ఏర్పాటు చేసేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంచి పక్కాగా నిబంధనల మేరకు పోలింగ్‌ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని