Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేయూత లక్ష్యాల పూర్తి

నెల్లూరు (వ్యవసాయం): వైఎస్సార్‌ చేయూత పథకంలో అర్హులకు గొర్రెలు, మేకలు, పశువుల యూనిట్లను సకాలంలో ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ కేంద్ర కార్యాలయం సంయుక్త సంచాలకులు రజనీకుమారి సూచించారు. నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో గురువారం చేయూత పురోగతిపై అధికారులతో సమీక్షించారు.లబ్ధిదారులకు మేలు రకాలైన జీవాలు, పశువులను వైద్యుల పర్యవేక్షణలో అందేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కృత్రిమ గర్భధారణ లక్ష్యాలపై ఆరా తీశారు. త్వరలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పచ్చి గడ్డి పెంపకానికి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జేడీఏ వెంకటస్వామిరెడ్డి, డీడీలు నరసింహారావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని