Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేసింది చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు: సురేష్‌

 

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: సుదీర్ఘ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతున్న చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో తాను చేసిన అభివృద్ధిని ఎందుకు చెప్పుకోలేకపోయారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. నెల్లూరులోని వైకాపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలని, ఓటు బ్యాంకు పెంచుకోవాలని భాజపా తాపత్రయపడుతుందన్నారు. ప్రమాణం చేయాలని లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నారని, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నాడు-నేడు, జగనన్న అమ్మఒడి కార్యక్రమాలపై చంద్రబాబునాయుడు విమర్శలు చేయడం దారుణమన్నారు. సభలో తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో రాళ్లు విసురుకుంటే ఓ గులక రాయిని పట్టుకుని డ్రామాలు ఆడారని విమర్శించారు. వైకాపాపై బురద జల్లి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని, 70 శాతం ఓట్లు వైకాపా అభ్యర్థికి రాబోతున్నాయని స్పష్టం చేశారు. గురుమూర్తికి అయిదు లక్షలకు పైగా మెజార్టీ రాబోతుందని జోస్యం చెప్పారు. తెదేపా, భాజపా రెండు మూడు స్థానాలకు పోటీ పడుతున్నాయని తెలిపారు.

ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి ఆదిమూపు సురేష్‌ గురువారం ఒక ప్రకటనలో కోరారు. నెల్లూరు జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఇటీవల కరోనాతో మృతి చెందినట్లు తెలుసుకుని ఈమేరకు ప్రకటించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని