Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హంస వాహనంపై అర్ధనారీశ్వరుడి రాజసం


స్వామి, అమ్మవార్ల ఊరేగింపు

 

సంగం, న్యూస్‌టుడే: స్థానిక కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, విశేష పుష్పాలతో అలంకరించి హంస వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం గురువారం ఉదయం వరకు వాహన సేవ చేపట్టారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవానికి కె.లక్ష్మి, శ్రీధర్‌రెడ్డి దంపతులు కైంకర్యం చేశారు. కె.రవీంద్రరెడ్డి దంపతులు పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.వెంకటేశ్వర్లు, ప్రధానార్చకులు గోపాల కృష్ణమూర్తి పర్యవేక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని