Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిధుల దుర్వినియోగంపై విచారణ


కార్యాలయంలో విచారిస్తున్న డీఎల్పీవో రమేష్‌బాబు

 

ఉదయగిరి, న్యూస్‌టుడే: ఉదయగిరి మేజర్‌ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కావలి డీఎల్పీవో రమేష్‌బాబు గురువారం విచారణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో దస్త్రాలు సమర్పించని వాటిని పరిగణనలోకి తీసుకొని రూ.1,14,43,991 మేర దుర్వినియోగమైనట్లు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు చెప్పారు. అప్పట్లో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేయగా- ప్రత్యేకాధికారులపైనా చర్యలకు సిఫారుసు చేశారన్నారు. అప్పటి సర్పంచిపై కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. కేసు విచారణలో భాగంగా అప్పటి కొన్ని దస్త్రాలను ఉదయగిరి సీఐకి అందజేశారన్నారు. వాటిని జిల్లా పంచాయతీ అధికారికి పంపగా- పునఃపరిశీలన చేయాలని ఆదేశాలు అందాయన్నారు. తదనుగుణంగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాక డీపీవోకు నివేదిక సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈవోపీఆర్డీ ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని