Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనధికారిక వేలం.. ఆదాయానికి సున్నం!

చెరువుకు ఏర్పాటు చేసిన వల

కొండాపురం, న్యూస్‌టుడే : కొండాపురం మండలంలో చెరువులకు అనధికారికంగా చేపల వేలం నిర్వహించి పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు. వేలంపాట ద్వారా పంచాయతీలకు రావాల్సిన సొమ్ము నేరుగా కొందరు నేతల జేబుల్లోకి చేరుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పంచాయతీ పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

● మండలంలో గరిమెనపెంట పంచాయతీలోని చెల్లగిరిగల చెరువుకు ఇటీవల అనధికారికంగా వేలంపాట నిర్వహించారు. చెరువులో చేపపిల్లలను వదిలి నేరుగా వలలు కట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు విస్తుపోయారు. అసలు పాట ఎప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయమై గరిమెనపెంట పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును వివరణ కోరగా చెరువులో చేపలువదిలిన విషయం తమకు తెలియదన్నారు. వేలం అనుమతులకోసం నివేదించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని