
వసూళ్లు జమ చేయకుంటే చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న సాంబశివారెడ్డి
ఉదయగిరి, న్యూస్టుడే: రుణ వసూళ్లను జమ చేయడంలో ఉదాసీనత వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి హెచ్చరించారు. స్థానిక స్త్రీశక్తి భవనంలో ఉదయగిరి, సీతారామపురం, మర్రిపాడు మండలాల వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎంలు, సీసీలు, వీవోఏలతో మంగళవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను శతశాతం వసూళ్లు చేయాలన్నారు. ఆ నగదును బ్యాంకు ద్వారా సంఘమిత్రకు జమ చేయాలని సూచించారు. వైఎస్సార్ క్రాంతి పథం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీవోఏలు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ప్రశంసించారు. వీవోఏలు, సీసీలు, ఏపీఎంలు ప్రతి బుధవారం వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. రుణాల వసూళ్లలో మర్రిపాడు మండల వీవోఏలు ముందంజలో ఉన్నారని అభినందించారు. ఏపీడీ రాజు, ప్రాంతీయ సమన్వయకర్త శేషారెడ్డి, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.
దుత్తలూరు: వైఎస్సార్ చేయూత పథకం కింద పొదుపు సంఘ సభ్యులకు మంజూరు చేసిన కిరాణా దుకాణాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మూడు మండలాల ఏపీఎంలు, సీసీలు, ఇతర సిబ్బందితో మంగళవారం సమీక్షించారు. ప్రతినెలా రెండుసార్లు సమావేశమై పుస్తక నిర్వహణ, పొదుపు, చెల్లింపులపై చర్చించాలన్నారు.