Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైల్వే నేరాల నియంత్రణకు చర్యలు

అధికారులతో సమీక్షిస్తున్న రైల్వే డీజీ

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: రైల్వే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లోని రైల్వే పోలీసు స్టేషన్‌ను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేయడంతో పాటు కేసులు, పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. రైల్వే డీఎస్పీ, సీఐ స్టేషన్‌ను పర్యవేక్షించారు. అనంతరం రైల్వే ఎస్పీ, డీఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. గుంతకల్లు డివిజన్‌ పరిధిలో నేరాలపై మాట్లాడారు. వేసవిలో నేరాలు పెరిగే అవకాశం ఉంటుందని, నియంత్రణ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీలైతే పక్క జిల్లాల నుంచి సిబ్బందిని తెప్పించుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో రైల్వే కేసులు తగ్గుముఖం పట్టాయని, పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు కొనసాగితే నేరాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయన వెంట గుంతకల్లు రైల్వే ఎస్పీ అనిల్‌బాబు, రైల్వే డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శ్రీనివాసాచారి, ఎస్సైలు సిరాజుద్దీన్‌, డీసీ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని