Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేటి నుంచి పోలీసులకు టీకా

నెల్లూరు (నేరవిభాగం), న్యూస్‌టుడే: జిల్లా పోలీసులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో హోమ్‌గార్డు నుంచి ఉన్నతాధికారి వరకు టీకా వేసేలా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని నూతన పోలీస్‌ కేంద్రంలో మూడు ప్రత్యేక కేంద్రాలు, పాత పోలీస్‌ కార్యాలయంలో ఒకటి, కావలి సబ్‌ డివిజన్‌ కార్యాలయం, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరులో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతిచోటా రోజుకు సుమారు 200 మందికి టీకా వేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తంగా 3,748 మంది సిబ్బంది టీకా వేయించుకోవాల్సి ఉంది. వీరితోపాటు జైళ్లు, రైల్వే, బెటాలియన్లలో సైతం బుధవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్యక్రమ పర్యవేక్షణకు ఒక్కో కేంద్రానికి ఒక్కో అధికారిని నియమించారు. ఏఆర్‌ ఏఎస్పీ వీరభద్రుడు, రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, హోమ్‌గార్డు డీఎస్పీ శ్రీనివాసరావు నెల్లూరులోని కేంద్రాలకు పర్యవేక్షకులుగా ఉంటారు. కావలి, ఆత్మకూరు, గూడూరుల్లో స్థానిక డీఎస్పీలు ప్రసాద్‌రావు, వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, నాయుడుపేట కేంద్రానికి స్థానిక ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షకులుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్‌ వేయించుకోవాలని మంగళవారం జరిగిన సమావేశంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని