Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతివలే సారథులు

పంచాయతీలకు మహరాణులుగా ఏకగ్రీవం

కట్టువపల్లి గ్రామ సర్పంచి, వార్డు సభ్యులు

మనుబోలు, న్యూస్‌టుడే : అతివలు తాము ఎందులోనూ తీసిపోమంటూ నిరూపించుకుంటున్నారు. వారంతా ఇంటి పట్టునే ఉండి సంసారాలను చక్కదిద్దుకునే మహిళలు. రాజకీయ అనుభవం లేనివారు. భర్తలు రాజకీయాలు చేస్తుంటే చూస్తుంటారే తప్ప ఎక్కడ ఏం జరుగుతోందనన్న విషయాలు వారికి అవసరం లేదు. కానీ నేడు అదే మహిళలు ఆ గ్రామాలకు ప్రథమ పౌరులుగా నిలిచారు. తమ గ్రామాలను తామే అభివృద్ధి చేయాల్సి వస్తుందన్న ఆలోచన కొద్ది రోజుల క్రితం వరకు వారికే తెలియదు. అలాంటి వారు పంచాయతీల్లో ఎటువంటి పోటీ లేకుండానే పాలనపగ్గాలు చేపట్టారు. జిల్లాలో 348 సర్పంచి స్థానాలకు వివిధ రిజర్వేషన్లలో బరిలోకి దిగారు. దాదాపు 96 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికై సారథులుగా నిలిచారు. సాధించారు.

జిల్లాలో 941 పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో నాలుగు విడతల్లో 935 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో కావలి డివిజన్‌, రెండో విడత ఆత్మకూరు డివిజన్‌, మూడో విడత గూడూరు, నాయుడుపేట, నాలుగో విడతలో నెల్లూరు డివిజన్‌ పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 96 పంచాయతీలకు అతివలే సారథులయ్యారు. ఇందులో పట్టుభద్రులైన సర్పంచులు ఒకరిద్దరూ ఉండడం గమనార్హం. ఏకగ్రీవ పంచాయతీలకు మహిళలే మహారాణులుగా గుర్తింపు పొందనున్నారు.

ఆదర్శంగా తీర్చిదిద్దుతా - ఏడెం మమత, సర్పంచి, పిడూరుపాలెం

నేను డిగ్రీ చదివాను. రాజకీయ అనుభవం లేదు. గృహిణిగా ఇంటిలోనే ఉంటూ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్నాను. గ్రామంలో తొలి ప్రాధాన్యంగా పారిశుద్ధ్యం, మంచినీటిపై దృష్టి సారిస్తాం. ప్రణాళికాబద్ధంగా గ్రామ సమస్యలను అధికగమించి గ్రామస్థుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శం గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం.

గ్రామాభివృద్ధికి పెద్దపీట - కల్లూరు ఇంద్రసేన(బీకాం), మల్లికార్జునపురం

గ్రామస్థుల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. గ్రామాభివృద్ధికి పెద్దపీట వేస్తూ గ్రామ సమస్యల పరిష్కరానికి శాయశక్తులా కృషి చేస్తాం. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పించి గ్రామస్థుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని