Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీకాళహస్తి- నడికుడి పనులు వేగవంతం

కార్మికులతో మాట్లాడుతున్న జీఎం గజానన్‌ మాల్యా 

వెంకటగిరి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి- నడికుడి రైల్వే లైను పనులను వేగవంతం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ఉద్ఘాటించారు. వెంకటగిరి రైల్వేస్టేషన్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వంద కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం వాటి వేగాన్ని 120 కి.మీ.లకు పెంచనున్నట్లు తెలిపారు. నడికుడి లైను పూర్తయితే వెంకటగిరి జంక్షన్‌గా మారుతుందన్నారు. తదునుగుణంగా రైల్వే ప్లాట్‌ఫాంలను విస్తరించాలని సూచించారు. గూడూరు- కాట్పాడి మధ్యనున్న వంతెనలు, అంతర్‌ బ్రిడ్జిలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైల్వే కార్మికులతో కాసేపు ముచ్చటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని