Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జేఈఈ మెయిన్స్‌...తొలిరోజు ఒక కేంద్రంలోనే

పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇందుకోసం జిల్లాలో ఆరు కేంద్రాలను కేటాయించగా.. తొలి రోజు నార్తురాజుపాళెం శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలోని అయాన్‌ కేంద్రంలో మాత్రమే జరిగింది. ఉదయం- మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్ష జరగాల్సి ఉండగా... మొదటి రోజు మధ్యాహ్నం సెషన్‌ వరకే నిర్వహించారు. విద్యార్థులు కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్రానికి ముందుగానే చేరుకోగా.. నిర్వాహకులు మాస్కులు, శానిటైజర్‌ను అందించారు. పూర్తి స్థాయిలో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేపడుతూ.. సామాజిక దూరం పాటిస్తూ.. విద్యార్థులను ఒకరి తర్వాత ఒకరిని కేంద్రంలోకి అనుమతించారు. మొత్తం 376కు 250 మంది హాజరయ్యారు. మొత్తం మీద మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా సాగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని