
బిట్రగుంట..ఉలిక్కిపడేలా..
బోగీలో మంటలు
నిజంగా రైలు ప్రమాదం జరిగిందా.. అన్న ఆందోళన కలిగించాయి. రైల్వేశాఖ, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ బృందాల మాక్‌డ్రిల్ దృశ్యాలు.. ఆ వెంటనే.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోవడం చూసినవారి వంతైంది. మంగళవారం బిట్రగుంట రైల్వేస్టేషన్లో ఆ శాఖ అధికారులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఉదయం 9.10గంటలకు రైలు ప్రమాదాన్ని సూచించే సైరన్కాల్ మోగగా.. వైద్య, ప్రమాద ఉపశమన వాహనాలతో రైల్వే భద్రతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ బృందాలు సంఘటనాస్థలంలో వాలిపోయారు. బాధితులుగా ఉన్నవారిని సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, రైల్వే ఆసుపత్రులకు తరలించడం తదితరాలు వారి సన్నద్ధతను కళ్లకు కట్టాయి. రైలు బోగీని అప్పటికప్పుడు బాగుచేసిన విధానం అబ్బురపరిచింది. విజయవాడ ఏడీఆర్ఎం శ్రీకాంత్, సీనియర్ డీఎస్వో రఘునాథరెడ్డి, సీనియర్ డీఎంఈ కె.శ్రీనివాస్, సికింద్రాబాద్ జోనల్ డిప్యూటీ సేఫ్టీ ఆఫీసర్ ధర్మ, ఎన్డీఆర్ఎఫ్ బృంద ప్రతినిధి శైలేంద్ర, వైద్యాధికారుల పర్యవేక్షణలో ఈ మాక్‌డ్రిల్ విజయవంతమైంది. - న్యూస్‌టుడే, బిట్రగుంట
మరమ్మతులు చేస్తున్న అధికారులు, సిబ్బంది