Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ సారి మామిడి పండుగే

నెల్లూరు గ్రామీణ మండలం కోడూరుపాడులో

పూతతో నిండిన మామిడి తోట

నెల్లూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: ఫలాల్లో రారాజు.. మామిడి. దీన్ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకే, దీన్ని ఫల రాజసంగా పిలుస్తారు. ఈ దఫా మామిడి తోటలు పూతతో కళకళలాడుతుండగా- కొన్ని నెలలు ఓపిక పడితే పండు మార్కెట్‌కు వచ్చేస్తుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

సమృద్ధి వర్షాలతో...

జిల్లాలో గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. భూగర్భ జల మట్టాలు పెరిగాయి. దీంతో మామిడి తోటలకు మంచి రోజులొచ్చాయి. ఏటా వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండగా- ఈ దఫా ఆ చింత తీరడంతో చెట్లకు పూత బాగా వచ్చింది. దీంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈసారి దిగుబడులు బాగా వచ్ఛి. నాలుగు రూపాయలు కళ్లజూస్తామన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.

పది వేల హెక్టార్లలో... జిల్లాలో పది వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉండగా- వింజమూరు, ఎ.ఎస్‌.పేట, ఆత్మకూరు, కోట, కావలి, తడ, పొదలకూరు, గూడూరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఒక్కో హెక్టారుకు సుమారు 7 నుంచి 8 వేల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా కాగా- ఆ లెక్కన పంట రకాన్ని అనుసరించి 50వేల నుంచి 80వేల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడికి రానుంది. తొలినాళ్లలో కాయలు అందుబాటులోకి వచ్చే సమయానికి టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా ఏడు వేల మంది వరకు ఈ తోటల పెంపకం చేపడుతున్నారు.

బంగినపల్లి, తోతాపురి

జిల్లాలో ఎక్కువ శాతం బంగినపల్లి, తోతాపురి(అంటు మామిడి) రకాలు సాగులో ఉండగా- బంగినపల్లిని ఎక్కువగా ఇష్టపడతారు. జిల్లాలో ప్రస్తుతం పూత దశలో ఉండగా... మే నెలకు దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల కొద్దిగా ముందొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లోగా వచ్చే నెలకు నూజివీడు పండ్లు అందుబాటులోకి రానున్నాయి. నూజివీడు కంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పండే బంగినపల్లి మామిడి కాయలు మంచి రుచిని కలిగి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

పూత, పిందె దశ కీలకం : ప్రదీప్‌, ఏడీ, ఉద్యానశాఖ

జిల్లాలో మామిడి పూత దశలో ఉంది. ఈ దఫా మంచి దిగుబడి రావచ్ఛుపూత, పిందె దశల్లో తోటలను కాపాడుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందొచ్ఛు పూత దశలో ఉన్న మామిడికి ప్రస్తుతం తేనె మంచు పురుగు ఉద్ధృతిని ఎక్కువగా ఉంది. తగిన నివారణ చర్యలు తీసుకోకుంటే పూత దెబ్బతిని దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సలహాలు, సూచనలు అవసరమైన రైతులు ఉద్యాన అధికారి రమేష్‌ 7995086940ను సంప్రదించి పొందవచ్ఛు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని