Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భయబడి.. గుడి పంచకు

కట్టువాపల్లిలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ

కేంద్రాన్ని చుట్టుముట్టిన వర్షపు నీరు

కట్టువాపల్లి(దొరవారిసత్రం), న్యూస్‌టుడే: చిన్నపాటి చినుకు రాలినా... ఆ పాఠశాలలో చదువుకు ఆటంకం ఏర్పడినట్లే. నెలల తరబడి బడి మూతపడాల్సిందే. విద్యార్థులు, ఉపాధ్యాయులు గదిలోకి కాదు కదా.. ఆవరణలోనూ కాలు మోపలేరు. కారణం.. చుట్టూ ఎత్తుగా ఉన్న సిమెంట్‌ రోడ్ల మధ్యలో లోతట్టు పాఠశాల కావడం.. నీరు బయటకు కదలలేని పరిస్థితి ఉండటం. దీంతో చేసేది లేక పక్కనే ఉన్న గుడి ఆవరణలో తరగతులు నిర్వహించుకోవాల్సి వస్తోంది. ఇది దొరవారి సత్రం మండలంలోని కట్టువాపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం దుస్థితి. అయిదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా... చక్కదిద్దే ప్రయత్నం కూడా చేయడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు-నేడు పనులపై ఆశలు పెట్టుకున్నా.. ఫలితం లేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరు మోటార్ల ద్వారా నీటిని తొలగించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలో చదువుతున్న సుమారు 70 మంది విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదని అంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ ఎంఈవో ధారా మస్తానయ్యను వివరణ కోరగా... కట్టువారిపల్లి పాఠశాల దుస్థితిని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మొదటి విడత నాడు-నేడులో ఈ పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదని, రెండో విడతలో అయ్యేలా కృషి చేస్తామన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని అన్నారు.

తరగతి గదిలో పరిస్థితి

దేవాలయ ఆవరణలో విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని