
గురుకులాల్లో సీట్ల భర్తీ
కోట, చిల్లకూరు, సూళ్లూరుపేట: కోటలోని ఎస్సీ గురుకుల కళాశాలలో శనివారం జిల్లాలోని 14 ఎస్సీ గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో సీట్ల భర్తీకి జిల్లా కోఆర్డినేటర్ హేమలత ఆధ్వర్యాన శనివారం నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పించారు. జిల్లాలోని 10 బాలికల జూనియర్ కళాశాలల్లో 44 సీట్లతోపాటు నాలుగు బాలుర జూనియర్ కళాశాలల్లో 67 సీట్లకు 58, ఐదో తరగతిలో 244 సీట్లకు 241 భర్తీ అయినట్లు ప్రిన్సిపల్ మేరి విజయశ్రీ పేర్కొన్నారు. కోట, వాకాడు, చిల్లకూరు, నాయుడుపేట జూనియర్ కళాశాలల్లోని 67కు 58, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, ముత్తుకూరు, కండలేరులోని బాలికల జూనియర్ కళాశాలల్లో 44 భర్తీ చేశారు. ముత్తుకూరు, డక్కిలి, కండలేరు, సూళ్లూరుపేట, బుచ్చి, సంగం, కోడూరు, పూడేరు, ఆదూరుపల్లి, బోగోలు, చిల్లకూరు, కోట, నాయుడుపేట, వాకాడుల్లోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో 244 సీట్లకు 241 సీట్లు భర్తీ అయ్యాయి.