
రూ. 184 కోట్లతో గిరి అభివృద్ధికి ప్రతిపాదనలు
మంత్రి బొత్సకు ప్రతిపాదనలువివరిస్తున్న ఎమ్మెల్యే ఆనం
వెంకటగిరి, నాయుడుపేట, న్యూస్టుడే : రూ. 184 కోట్ల రూపాయిలతో వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిపాదనలు అందించినట్లు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో శనివారం ఆనం నివాసానికి పుర పాలక మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. ఈ క్రమంలో అభివృద్ది పనులకు సంబంధించిన ప్రతిపాదనలు మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. మంత్రిని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిసి నాయుడుపేట, సూళ్లూరుపేట పట్టణాలు అభివృద్ధిపై చర్చించారు.
Tags :