Published : 24/01/2021 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం


డైరీలు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి తదితరులు

 

కావలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. వైకాపా ఉపాధ్యాయ సమాఖ్య నూతన సంవత్సరాది క్యాలెండర్లు, డైరీల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తానా అంటే.. నిమ్మగడ్డ తందానా అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పినట్లు చేస్తూ.. ఎన్నికల కమిషన్‌ స్థాయిని దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపాకు పరోక్షంగా సాయం చేయాలన్న ఉద్దేశంతోనే.. యుద్ధప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రకటన విడుదల చేశారన్నారు. సంఘ నాయకులు మునీర్‌జాన్‌, సుదర్శన్‌, వినయ్‌, నారాయణ, నాజీమ్‌, జగన్‌, ప్రసాద్‌, చంద్రకళ, విజయరత్నం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రథం నిర్మాణం..

బిట్రగుంట: బిలకూటక్షేత్రం కొండబిట్రగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి రథం అంచనాల మార్పునకు దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. కడనూతలలోని ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో శనివారం అధికారులు భేటీ అయ్యారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ శ్రీరామ్‌ మాల్యాద్రి, డీఈ జనార్దన్‌, స్థపతి సురేంద్ర, అంతర్వేది రథ నిర్మాణ గుత్తేదారు గణపతి ఆచార్యులతో సమాలోచనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రసన్నుడి రథం నిర్మించబోతున్నట్లు చెప్పారు. అనంతరం అధికారుల బృందం దగ్ధమైన రథాన్ని పరిశీలించింది. నూతన రథం ఏర్పాటుకు అవసరమైన అంచనాలు రూపొందించేందుకు శాస్త్రోక్తం అంచనాలు పరిధిలోకి తీసుకొని కొలతలు తీసుకొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని