
పోలీసుల సేవలు చిరస్మరణీయం
సిబ్బందికి జ్ఞాపిక అందజేస్తున్న డీఎస్పీ తదితరులు
కావలి: కరోనా తీవ్రంగా విజృంభించిన నాలుగైదు నెలల కాలంలో పోలీసులు చిరస్మరణీయ సేవలందించారని డీఎస్పీ ప్రసాద్‌రావు అన్నారు. ఏపీ వినియోగదారుల హక్కుల రక్షణ ఫోరం ఆధ్వర్యాన విశిష్ట సేవలందించిన పోలీసు సిబ్బందిని శనివారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. కావడి డివిజన్ పరిధిలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసినట్లు చెప్పారు. అధికారులు, పోలీసులు తీసుకున్న చర్యలతోనే అప్పట్లో కేసుల సంఖ్య గణనీయంగా గుర్తు చేశారు. అనంతరం మహిళా హోంగార్డు సూర్యావలి, హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, కొండయ్యను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అలాగే పురపాలక కమిషనరు శివారెడ్డి, ఎస్సైల సేవలను ప్రశంసించారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపాల్, కార్యదర్శి శేషయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కల్పన, జిల్లా అధ్యక్షురాలు శివాని, కన్వీనర్ ప్రభాకర్, ప్రసాద్, ఏపీఎంఎఫ్ షేకూర్, రవీంద్ర తదితరులున్నారు.