Published : 24/01/2021 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టౌన్‌హాల్‌లో మళ్లీ సందడి

అలరించిన సంగీత, నృత్య ప్రదర్శనలు


నృత్య ప్రదర్శన చేస్తున్న గురుకృప కళాక్షేత్రం కళాకారులు

 

నెల్లూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : కరోనాతో మూగబోయిన టౌన్‌హాల్‌లో సందడి శనివారం ప్రారంభమైంది. ప్రదర్శనలను రెడ్‌క్రాస్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి కన్వీనర్‌ తుంగా శివప్రసాద్‌రెడ్డి, ట్రస్టు సభ్యులు వాకాటి విజయకుమార్‌రెడ్డి, రేబాల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసురాలు జె.బాలార్కతో పాటు ఆమె శిష్యులు శాస్త్రీయ సంగీత కచేరీలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం సంగీత గురువు సురభి గాయత్రి శిష్యబృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమాల్లో విశ్రాంత అధికారి పెంచలరెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని