Updated : 20/01/2021 05:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటి నుంచే పని అనురాగాల  పందిరి 

అమ్మకు నీడై.. నాన్నకు తోడై.. ●

ఆస్వాదిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు

న్యూస్‌టుడే, కలిగిరి : ఉన్నత విద్య.. పెద్ద నగరాల్లో ఉద్యోగం.. రూ.లక్షల్లో జీతం.. నగరాల్లో నివాసం.. వారానికో వేడుక.. ఇలా ఎన్నో సౌకర్యాలు ఓ వైపు... ఉరుకుల పరుగుల జీవనం.. గంటల కొద్దీ ట్రాఫిక్‌లో పయనం.. వయసు పైబడుతున్న కన్నవారికి.. కుటుంబానికి దూరంగా ఉన్నామనే వెలితి.. ఆత్మీయుల కష్ట సుఖాల్లో పాలుపంచుకోలేని పరిస్థితి. ఇదీ ఐటీ ఉద్యోగుల జీవనశైలి. అలా యాంత్రికంగా నడుస్తున్న ఐటీ ఉద్యోగుల జీవితాన్ని కరోనా విచిత్ర మలుపు తిప్పింది. లాక్‌డౌన్‌తో ఆయా సంస్థలు వారికి ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పించగా- నగరం వీడి పుట్టిన గడ్డకు చేరిన ఉద్యోగుల దైనందిన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇంట్లో ఉంటూనే ఇప్పుడు ఆనందంగా పని చేసుకుంటున్నారు. అమ్మ చేతి వంట తింటున్నారు. నాన్నకు చేదోడుగా నిలుస్తున్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. కొందరు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడితే... ఇంకొందరు తల్లిదండ్రులకు వ్యవసాయంలోనూ సాయంగా నిలుస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌ కోర్సులు నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. సాంకేతికంగా.. పనిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కుటుంబంతో గడపడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంటున్నారు.

కలిసుండే అవకాశం

హెచ్‌సీఎల్‌ సంస్థలో హైదరాబాద్‌లో రూ.అయిదు లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి.. విధులు నిర్వర్తిస్తున్నా. ఆఫీసుకు వెళితే రోజు ఎలా గడుస్తుందో తెలియదు. అక్కడున్నప్పుడు వారాంతంలో సహచరులతో సరదాగా గడిపినా.. చదువు, ఉద్యోగరీత్యా దూరంగా ఉండటంతో కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోలేకపోయేవాణ్ని. ఇంటి నుంచి పని వల్ల కొన్ని నెలలుగా తల్లిదండ్రులతో కలిసి ఉండే అవకాశం దక్కింది. ఈ అవకాశం చాలా గొప్పగా, సంతోషంగా అనిపిస్తోంది. - బి.విష్ణు

కుటుంబ సభ్యులతో...

నేను పుణెలోని టీసీఎస్‌ సంస్థలో పనిచేస్తున్నా. ఏడాదికి రూ. ఎనిమిది లక్షల వేతనం. మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాననే భావన ఇప్పుడు నాలో తొలగింది. ఇంట్లో వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. విధుల్లో భాగంగా ఇంట్లో

విద్యుత్తు, ఇంటర్నెట్‌కు సంబంధించిన చికాకులు ఉన్నా.. అవేవీ పెద్దగా ఇబ్బంది అనిపించడం లేదు. - బి.వినీత్‌

నైపుణ్యానికి కొత్త కోర్సులు

బెంగళూరు సీటీఎస్‌ కంపెనీలో రూ. నాలుగు లక్షల వార్షిక వేతనానికి ఉద్యోగంలో చేరా. చేరిన కొద్ది రోజులకే లాక్‌డౌన్‌ ఆరంభమైంది. అక్కడ ఉంటే సీనియర్స్‌ నుంచి విలువైన సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఉద్యోగం చేస్తూనే నైపుణ్యాలు పెంచుకునేందుకు ఆన్‌లైన్‌లో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నా. ఉద్యోగం, చదువు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం చాలా సంతోషంగా ఉంది.- కె.పవన్‌

ఎంతో మేలు

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న హెక్జగాన్‌ కంపెనీలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవెలపర్‌గా రూ.12లక్షల వార్షిక వేతనానికి పనిచేస్తున్నా. కరోనా కారణంగా గత మార్చిలో ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని ఆదే శించారు. ఇంట్లో ఉండి.. ఉద్యోగం చేయడంతో ఖర్చులు తగ్గాయి. తల్లిదండ్రులకు అండగా ఉంటున్నా. ఎంతో సంతోషంగా ఉంది. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటం ఎంతో ఆనందదాయకం. పండగలన్నీ కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకొంటున్నా. - పి.విద్యాసాగర్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని