
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
త్రిపురాంతకం, న్యూస్‌టుడే: తేనీరు సేవించేందుకు వెళుతున్న దంపతులపైకి కారు దూసుకెళ్లడంతో భార్య మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కావలి మండలం బాలకృష్ణ నగర్‌కు చెందిన మొగిలి తిరుపతిరావు, మంగమ్మ కుటుంబ సభ్యులతో కలిసి రెండు నెలల క్రితం తెలంగాణ వెళ్లి బాతు పిల్లలు కొనుగోలు చేసి అక్కడే ఉన్నారు. వారం రోజుల క్రితం త్రిపురాంతకం మండలం గణపవరం వచ్చారు. మంగళవారం మంగమ్మ భర్తతో కలిసి టీ తాగేందుకు వెళ్తుండగా, కర్నూలు నుంచి గుంటూరు వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొని మంగమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటనా స్థలాన్ని సీఐ దేవ ప్రభాకర్, ఎస్సై కృష్ణయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags :