
రూ.1.95 లక్షల విలువైన గుట్కా పట్టివేత
కలిగిరి, న్యూస్‌టుడే : మండల కేంద్రం కలిగిరిలో మంగళవారం రాత్రి కారులో తరలిస్తున్న నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మెయిన్‌రోడ్డుపై వాహన తనిఖీల్లో భాగంగా కావలి నుంచి కలిగిరి వైపు వస్తున్న ఏపీ39సీ6177 కారును ఆపి తనిఖీ చేశారు. కారులోని సంచులను పరిశీలించగా 15,710 గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని కారులోని ఇద్దరు నిందితులు కలిగిరికి చెందిన గణేశం కేశవులురెడ్డి, కావలికి చెందిన వడ్లమూడి శివబ్రహ్మచారిని అదుపులోకి తీసుకున్నారు. గుట్కాల విలువ రూ.1,95,750 ఉంటుందని ఎస్సై వీరేంద్ర తెలిపారు. వీరితో పాటు సరకును అందజేసిన కావలికి చెందిన మల్లిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Tags :