Updated : 20/01/2021 05:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మత్స్యకారుల సంక్షేమానికి కృషి 


మాట్లాడుతున్న ఆప్కాప్‌ ఛైర్మన్‌ అనిల్‌ బాబు, పక్కన జేడీ నాగేశ్వరరావు

 

నెల్లూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఆప్కాప్‌ ఛైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు తెలిపారు. నగరంలోని మత్స్య శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా మత్స్యకార సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మత్స్యకార మిత్ర పొదుపు గ్రూపులకు డీసీసీబీ ద్వారా రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా చేపల వేట సాగిస్తున్న తమిళనాడు మర పడవలను నిరోధించడానికి ప్రభుత్వం తరఫున, సీఎస్‌ఆర్‌ ఫండ్‌ ద్వారా మర పడవలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 12 కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కావలిలో రూ.50 లక్షలతో ఐస్‌ ప్లాంట్‌, రూ.10 లక్షలతో ఫిష్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌ ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. తడ మండలంలోని మత్స్యకారుల బోట్లకు ఆయిల్‌ సరఫరా చేసేందుకు కొత్త పెట్రోల్‌ బంకు మంజూరు చేస్తామన్నారు. జేడీ నాగేశ్వరరావు, డీడీ శ్రీనివాసనాయక్‌, ఏడీలు చాంద్‌బాషా, ప్రసాద్‌, ఎఫ్‌డీవోలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని