
కరోనా నిబంధనలు పాటిస్తూ గణతంత్ర వేడుకలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ చక్రధర్‌బాబు
నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: కరోనా నిబంధనలను పాటిస్తూ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని కలెక్టర్ చక్రధర్‌బాబు ఉద్బోధించారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు, జిల్లా టాస్క్ఫోర్సు అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా టీకా వేయించుకున్న వారు, వైద్యాధికారులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. జిల్లాలో టీకా పంపిణీ సజావుగా సాగుతోందని చెప్పారు. ఏ సందేహం ఉన్నా 1075, 1077 ట్రోల్ ఫ్రీనంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ నెల 23న అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రతిజ్ఞ చేయాలన్నారు. జేసీ హరేంధిరప్రసాద్, కమిషనర్ దినేష్, జడ్పీ సీఈవో పి.సుశీల, డీపీవో ఎం.ధనలక్ష్మి, డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ శ్రీనివాస్‌కుమార్, డీఆర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు.