
ఎస్పీకి... అంత్రిక్ సురక్ష సేవా పతకం
డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి పతకం అందుకుంటున్న ఎస్పీ భాస్కర్ భూషణ్
నెల్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎస్పీ భాస్కర్ భూషణ్ మంగళవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ప్రతిష్ఠాత్మక అంత్రిక్ సురక్ష సేవా పతకం-2020ని అందుకున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు కేంద్ర హోమంత్రిత్వశాఖ ఈ పురస్కారం అందజేస్తుంది. ఈ పతకాన్ని రాష్ట్రం నుంచి అయిదుగురు అధికారులు దక్కించుకోగా- వారిలో భాస్కర్ భూషణ్ ఒకరు. జిల్లా ఎస్పీతో పాటు డీఐజీ పాలరాజు(టెక్నికల్), డీఐజీ క్రాంతి రానాటాటా(అనంతపురం రేంజి), డీఐజీ రాజశేఖర్‌బాబు(లాఅండ్ఆర్డర్) విశాల్‌గున్నీ (ఎస్పీ గుంటూరు రూరల్) డీజీపీ నుంచి ఈ పతకాలను అందుకున్నారు.
Tags :