Published : 29/11/2020 05:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరద బాధితులను ఆదుకుంటాం: మేకపాటి

ఆత్మకూరు, సంగ : నియోజకవర్గంలోని ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, చేజర్ల, సగం మండలాల్లోని సోమశిల వరద, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద ప్రభావంతో నష్టపోయిన రైతులను, నిరాశ్రయులను ఆదుకుంటామన్నారు. సంఘటన జాతీయ విపత్తు పరిధిలోకి వస్తుందని, కేంద్రం సాయంతో బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మరో రెండు తుపాను హెచ్చరికలున్న నేపథ్యంలో చెరువులకు నష్టం వాటిళ్లకుండా నిల్వలు తగ్గించడంపై దృష్టి నిలపాలని అధికారులకు సూచించారు. వరదల సమయంలో అధికారులు చేపట్టిన సహాయ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాగులవెల్లటూరుతో మొదలు పెట్టి అప్పారావుపాళెం వంతెన వద్ద పెన్నా ప్రవాహాన్ని పరిశీలించారు. ఆత్మకూరు చెరువును, వెంగంనాడుపల్లి, కచెరితేవరాయపల్లిని పరిశీలించారు. కచెరిదేవరాయపల్లికి వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో.. జేసీబీ ఎక్కి ఆ గ్రామాన్ని పరిశీలించారు. అనంతసాగరం చెరువును పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీవో సువర్ణమ్మ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, కమిషనర్‌ రమేష్‌బాబుతోపాటు ఇతర అధికారులు, అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని