
జ్యోతిరావు ఫులే అడుగుజాడల్లో నడుద్దాం
పూలమాల వేస్తున్న కలెక్టర్ చక్రధర్‌బాబు
నెల్లూరు(కలెక్టరేట్, ఇరిగేషన్, లీగల్, సంక్షేమం, స్టోన్‌హౌస్‌పేట): మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. శనివారం ఫులే వర్ధంతి సందర్భంగా శనివారం నెల్లూరులోని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలవడంతో పాటు బాలికా విద్య, వితంతు వివాహాలకు మద్దతుగా పోరాటం చేశారన్నారు. జేసీ సూర్యప్రకాష్‌రావు, నగరపాలకసంస్థ కమిషనర్ దినేష్‌కుమార్, ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్, బీసీ సంక్షేమశాఖాధికారి వెంకటయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు. ● నగరంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాళులర్పించారు. ● నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఫులే చిత్రపటానికి, మినీబైపాసులోని ఆయన విగ్రహానికి ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అంజలి ఘటించారు. ● జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ నాయకుడు ఆర్.రోజారెడ్డి, ఏపీ లాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నరసయ్య ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ● ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణ, మహాసభ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రఘురామ్ నివాళులర్పించారు. ● నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అధ్యక్షుడు జి.భరత్‌కుమార్, మాలమహానాడు నేత స్వర్ణా వెంకయ్య నివాళి అర్పించారు.
నివాళులర్పిస్తున్న అజీజ్