
సహాయ చర్యలపై మంత్రి ఆరా
నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : నివర్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నగరంలో జరిగిన నష్టం, చేపట్టిన సహాయ చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు తదితరాలపై మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు. శనివారం సీఅండ్డీఎంఏ విజయకుమార్‌తో కలసి నగరపాలకసంస్థ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఛాంబరు నుంచి కమిషనర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ నగరంలో పెన్నా ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, పాలు, తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలియజేశారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కమిషనర్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ పార్ధసారథి, ఎస్ఈ సంజయ్, డీసీపీ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Tags :