
వరికి కష్టం.. రోడ్లకు నష్టం!
నివర్ తుపాను విధ్వంసం తీరిది
రూ.225 కోట్లుగా లెక్కతేల్చిన అధికారులు
సైదాపురం మండలంలో దెబ్బతిన్న బొప్పాయి తోటను
పరిశీలిస్తున్న ఉద్యానశాఖ ఏడీ ప్రదీప్, సిబ్బంది
ఈనాడు-నెల్లూరు, నెల్లూరు కలెక్టరేట్, వ్యవసాయం : అనుకున్నట్లే అయింది.. జిల్లాలో వరి నారుమళ్లు, రోడ్లపైనే నివర్ తుపాను పెను ప్రభావం చూపింది.. గంటల వ్యవధిలో సాగించిన విధ్వంసంలో ఈ రెండు రంగాలే తీవ్రంగా నష్టపోగా.. ఆ విషయం అధికారుల అధ్యయనంలోనూ వెల్లడవుతోంది. శనివారం నాటికి లెక్కగట్టిన వివరాల ప్రకారం... మొత్తం రూ.225.72 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తేలింది. శాఖల వారీగా ఆ వివరాలు వెల్లడి కాగా.. వ్యవసాయ, ఉద్యాన రంగాలపై స్పష్టత వచ్చింది. ఆ నష్టం తీరుతెన్నులను పరిశీలిస్తే...
Tags :