Published : 27/11/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వీఎస్‌యూ ఆచార్యుడిపై విచారణకు డిమాండ్‌

నెల్లూరు(విద్య) : ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆచార్యుడు రాసిన పరిశోధన వ్యాసాన్ని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆచార్యుడు తన పేరిట ప్రచురించుకోవడం దారుణమని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి నాగేష్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై నిజనిర్ధరణ కమిటీ వేసి విచారించాలన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలను పెంచేలా ఉండాలేగానీ దిగజారుడు తగదన్నారు. నగర కార్యదర్శి జయంత్‌, సహాయ కార్యదర్శి శ్రీను తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని